Start a new topic

works inaugurated at patnapur under SAGY,adilabad district,telangana

పట్నాపూర్‌ను అగ్రగామిగా నిలుపుదాం

-ఆదిలాబాద్ ఎంపీ నగేశ్
బోథ్, నమస్తే తెలంగాణ: ఆదర్శ్ సంసద్ యోజనతో ప్రధానమంత్రిచే గుర్తింపు పొం దిన పట్నాపూర్‌ను దేశంలోనే అగ్రగామిగా నిలుపుదామని ఆదిలాబాద్ పార్లమెంట్ స భ్యుడు గొడం నగేశ్ పిలుపునిచ్చారు. బుధవారం బోథ్ మండలంలోని పట్నాపూర్‌లో ఎమ్మెల్యే రాథో డ్ బాపురావ్, ఐటీడీఏ పీవో ఆర్వీ కర్ణన్‌తో కలిసి ప లు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ 545 పార్లమెంట్ నియోజకవర్గాల ప రిధిలో సంసద్ యోజన అమలులో గుర్తింపు పొం దిన వంద గ్రామాల్లో పట్నాపూర్ నెంబర్‌వన్ స్థానం లో ఉండడం రాష్ర్టానికే గర్వకారణమన్నారు. గ్రామ స్తులు ఐక్యంగా ఉంటే రాబోయే రోజుల్లో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తామన్నారు. 

డిజిటల్ లిటరసీ గ్రామంగా తీర్చిదిద్దుతామన్నారు. ఇంటింటి కీ సోలార్ ల్యాంప్స్ అందిస్తామన్నారు. ముద్ర యో జనా కింద వంద శాతం జీవిత బీమా అమలుకు కృ షి చేయాలని అధికారులకు సూచించారు. బోథ్ ఎ మ్మెల్యే రాథోడ్ బాపురావ్ మాట్లాడుతూ పట్నాపూర్ పట్టణంలా అభివృద్ధి చెందాలన్నారు. ఐటీడీఏ పీవో ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ ఆర్‌ఓఆర్ పట్టాదారులకు రుణాలు ఇప్పించడంతో పాటు భూసార పరీక్షలు చే యించుకుని దేశంలోనే పట్నాపూర్ గుర్తింపు తెచ్చు కుందన్నారు. గ్రామాభివృద్ధికి పూర్తి సహకారం అం దిస్తామన్నారు. 

సమావేశంలో ఎంపీపీ గంగుల లక్ష్మి, జడ్పీటీసీ బండారి సాయమ్మ, ఏపీడీ మధుసూదన్, ఎంపీడీఓ బీ అప్పారావ్, డీఈఈ ఆనంద్‌కుమార్, కత్తూరి రాకేశ్‌కుమార్, ఎంపీటీసీ ఆప్క శంకర్, స ర్పంచ్ కే గంగాధర్, టీఆర్‌ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు జీవీ రమణ, ఎస్ రుక్మణ్‌సింగ్, బీ ముత్యంరెడ్డి, ఆ ప్క కిషన్, జగన్‌మోహన్‌రెడ్డి, డీ నారాయణరెడ్డి, తాహెర్‌బిన్‌సలాం, భోజారాం పాల్గొన్నారు.

అభివృద్ధి పనుల ప్రారంభం..
పట్నాపూర్ 4 లక్షలతో నిర్మించిన వాటర్ ప్లాం ట్, 25 లక్షలతో నిర్మించిన బీటీ రోడ్డు, 10 లక్షల తో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం, 10.85 లక్షలతో నిర్మించనున్న సీసీరోడ్లు, 20 వేలతో ని ర్మించిన స్వాగత తోరణం 40 వేలతో ఏర్పాటు చే సిన ఎకాస్టిక్ మిషన్, 1.50 లక్షలతో నిర్మించిన బ స్‌షెల్టర్‌లను ఎంపీ, ఎమ్మెల్యే, ఐటీడీఏ పీఓ, అధి కారులు ప్రారంభించారు.

Login or Signup to post a comment